తమిళనాడులో 72ఓట్లతో కమల్ హాసన్ గెలుపు ?

తమిళనాడులో 72ఓట్లతో కమల్ హాసన్ గెలుపు ?

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ 72 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు సమాచారం. ఓట్ల మెజారిటీ చాలా స్వల్పంగా ఉండడంతో అక్కడ రీకౌంటింగ్ జరుగుతోంది. దీంతో అధికారికంగా ఫలితం ప్రకటించడానికి సమయం పడుతుందని తెలుస్తోంది. రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నా డీఎంకే పార్టీ రెండంకెలకే పరిమితం కాగా.. ప్రతిపక్ష డీఎంకే 125కుపైగా స్థానాలతో అధికారం కైవసం చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ కూడా 15కుపైగా స్థానాల్లో ఆధిక్యంతో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయగా... ఎన్నికలకు ఏడాది ముందు పార్టీ పెట్టి.. ఒంటరిగా బరిలోకి దిగిన కమల్ హాసన్ తన అభిమానులు ఎక్కువగా ఉన్న దక్షిణ కోయంబత్తూరు నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుండి ప్రతిపక్ష డీఎంకే గెలుపు బాటలో నడవగా.. అధికార అన్నాడీఎంకే ప్రతిపక్ష స్థానానికే పరిమితం అవుతున్న సూచనలు కనిపించాయి. గట్టి పోటీ ఇస్తాడేమోననుకున్న కమల్ హాసన్ పార్టీ ఎక్కడా అడ్రస్ లేకుండా పోయింది. అయితే తన పార్టీ తరపున ఒకే ఒక్కడుగా ఆయన స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలుపొందే పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ప్రతి రౌండ్ లోనూ కమల్ హాసన్ స్వల్ప ఆధిక్యంతో నిలిచారు. ఓట్ల మెజారిటీ స్వల్పంగా ఉండడంతో రీకౌంటింగ్ జరుగుతుండడంతో ఫలితం ప్రకటన ఆలస్యం అవుతోంది. తారుమారైనా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.